అమరావతి : ఏపీలో కూటమి నాయకులు కుట్రలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని,ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఏపీ సీఎం వైస్ జగన్ (AP CM Jagan) కోరారు. పల్నాడు జిల్లా చిలకూరిపేటలో నిర్వహించిన రోడ్ షోలో జగన్ మాట్లాడారు.
వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అందించే పెన్షన్ (Pensions) ను ఇంటికి రాకుండా చంద్రబాబు (Chandra Babu) అడ్డుకున్నారని ఆరోపించారు. ఇతర ప్రభుత్వ పథకాలను ఢిల్లీ పెద్దలతో కలిసి అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదవాడు ఒకవైపు.. పెత్తందార్లు మరోవైపు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ల మీద కూటమి దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా పాటిస్తూ ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చామని వెల్లడించారు. 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చామని అన్నారు. సుమారు. రూ. 2.70 లక్షల కోట్లను బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతల్లోకి జమ అవుతున్నాయని వివరించారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష అంతకంటే లేదని జగన్ స్పష్టం చేశారు.