అమరావతి : విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ (20707/20708) ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల సంఖ్యను రేపటి నుంచి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్ల్లో కోచ్‌ల సంఖ్య 8 ఉండగా 16కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
సీట్ల సంఖ్య 530 నుంచి 1,128 కు పెరుగనుందని వివరించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, చైర్‌కార్ కోచ్‌లు 7 ఉండగా ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2, చైర్‌కార్ కోచ్‌లు 14కు పెరుగుతాయని జీఎం వివరించారు. పెరిగిన కోచ్‌ల సంఖ్యఈ నెల 13 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు.