హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు, షేర్ల పంపకం(Shares dispute) గొడవపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్( NCLT ) ఈనెల 13కు విచారణను వాయిదా వేసింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ ఎన్సీఎల్టీలో విజయమ్మ (Vijayamma), షర్మిల ( Sharmila) , జనార్దన్‌రెడ్డిని (Janardan Reddy) ప్రతివాదులుగా పేర్కొంటూ జగన్ పిటిషన్ ( Petition )దాఖలు చేశారు.
ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో స్పందించిన ఎన్సీఎల్టీ విచారణను వాయిదా వేసింది. షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట ఉన్న 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు.