అమరావతి : ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాణ్యమైన, అందుబాటులో మద్యం ధర ఉంటుందని ప్రకటించి మాట మార్చింది. మద్యం అమ్మకాలపై కాకుండా అదనంగా 2 శాతం డ్రగ్స్ నియంత్రణ సెస్ విధిస్తూ మంగళవారం ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులిచ్చింది .
మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 1500 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం ఏపీలోని 26 జిల్లాలో 3396 మద్యం దుకాణాలకు నిన్న లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. దుకాణాలు దక్కించుకున్న వారు రేపటి నుంచి మద్యం అమ్మకాలను ప్రారంభించనున్నారు.
మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిని కోసం బెదిరిస్తున్నారన్న నాయకులను ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని , ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.