తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు (Tirumala) చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ (Vaikunta ) ద్వార దర్శనాలకు టోకెన్లు పొందిన భక్తులు క్యూలైన్లో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
రెండురోజుల పాటు నిర్వహించిన ఏకాదశి (Ekadasi ) ద్వాదశి దర్శనాలు ముగియగా ఎనిమిది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. నిన్న శ్రీవారిని 53, 013 మంది భక్తులు దర్శించుకోగా 13,283 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గత రెండు రోజుల్లో అత్యంత తక్కువగా 1,13,107 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు.
స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు పరిహారం చెల్లించిన టీటీడీ చైర్మన్
తిరుపతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో (Stampede ) తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో 7 మంది బాధితులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ( BR Naidu) పరిహారాన్ని అందజేశారు.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ పాల్గొన్నారు.