(Goutham Sawang) దేశంలో అత్యుత్తమ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిలిచారు. రాష్ట్ర ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలకు గాను ఆయనను అత్యుత్తమ డీజీపీగా ది బెటర్ ఇండియా ప్రకటించింది. 2021 లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ఏజెన్సీ విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండేండ్లలో ప్రజలకు అసాధారణమైన సేవలను డీజీపీ గౌతం సవాంగ్ అందించారని ది బెటర్ ఇండియా కొనియాడింది.
దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ ఆప్షన్ బటన్ ద్వారా బాధితులకు వెంటనే రక్షణ కల్పించడానికి గౌతం సవాంగ్ చొరవ తీసుకున్నారని ఏజెన్సీ తెలిపింది. బాధితుల ఫిర్యాదులు, త్వరితగతిన విచారణలో టెక్నాలజీని వినియోగించడం వల్ల చాలా సమయం ఆదా అవుతున్నదని వివరించింది. ఎస్ఓఎస్ ఆప్షన్ ఎంపిక ద్వారా కేవలం ఐదు నెలల్లో రికార్డు స్థాయిలో 2,64,000 డౌన్లోడ్లతో 85 శాతం కేసులను పరిష్కరించడానికి సాంకేతికత ఉపయోగించారు. మహిళల రక్షణలో దిశ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉన్నదని ది బెటర్ ఇండియా పేర్కొన్నది. ఐదు నెలల్లోనే దిశా యాప్ 12.57 లక్షల డౌన్లోడ్లను సాధించింది.
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..