అమరావతి : అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటైన చేనేత పరిశ్రమ (Handloom industry) ను ఆదుకోవడానికి ఏపీ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చేనేత రంగానికి జీవం పాయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.
చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని గతంలోనే చెప్పానని, చెప్పినట్లే చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని వెల్లడించారు. యువత, ఉద్యోగులు కూడా చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. నేతన్నలు, చేనేత పరిశ్రమకు మా ప్రభుత్వం భరోసా ఇస్తుందని వివరించారు.
సీఎం చంద్రబాబు (Chandrababu) విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతలకు గతంలో ఇచ్చిన పథకాలన్నింటినీ వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకుంటామని పేర్కొన్నారు.
ఏపీలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేవరకు అండగా ఉంటామనిచేనేత వస్త్రాల(Handloom garments) పై జీఎస్టీ(GST) తొలగించేందుకు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని, లేకపోతే రియింబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించారు. చేనేత కార్మికుల ఆరోగ్య బీమా కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తానని అన్నారు.