Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ సతీమణి సుధా దేవ్ వర్మ దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆమెకు ఈవో శ్రీనివాసరావు పూలమాలతో స్వాగతం పలికారు. అర్చక, వేద పండితులు తిలకధారణ చేశారు.
అనంతరం గవర్నర్ సతీమణి సుధా దేవ్ వర్మ.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాల అనంతరం అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ఆమెకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాలు శేష వస్త్రాలు అందించారు.