అమరావతి : ఏపీలో ఓ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. అల్లూరి జిల్లాలోని పెదబయలు మండలం తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని నెలలుగా తహసీల్ కార్యాలయం పైగదిలో ఉంటున్న ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
గురువారం ఆయన గదికి వెళ్లిన సిబ్బంది పిలిచినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో గది కిటికి నుంచి పరిశీలించగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో సిబ్బంది ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.