అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన పీఆర్సీ కొత్త జీవోల పట్ల ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు, పింఛన్దారులు అసంతృప్తిగా ఉన్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తూ జస్టిస్ ఫర్ పీఆర్సీ పేరిట ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖను రాశారు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై రెండు లక్షల మందికి పైగా అభిప్రాయాలను సేకరించి సీఎంకు పంపించినట్లు వారు వెల్లడించారు. పీఆర్సీపై చర్చించాలని సీఎం కార్యాలయాన్ని అపాయింట్మెంట్ కోరినా ఫలితం లేకపోయిందన్నాని పేర్కొన్నారు.
అందువల్లే బహిరంగ లేక విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనరల్ సమస్యలు పరిష్కరించకపోతే మరో ఉద్యమయం తప్పదని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీపై ఉద్యోగుల నుంచి అభిప్రాయం కోరితే అత్యధిక శాతం అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.