YS Jagan | ఏపీలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో అవినీతి జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ మండిపడింది. ఇసుక గురించి, మద్యం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే నీకే మంచిది సైకో జగన్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని అడగడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు ఉండే బెంగళూరులో లభించడం లేదేమో.. మా ఏపీలో ఉచిత ఇసుకే లభిస్తుందని స్పష్టంచేసింది.
ఒక ఘరానా దొంగోడు, నేను దొరని అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉండే వాడు. ఆ సైకో దొంగ బుద్ధి పసిగట్టిన ప్రజలు.. ఆ దొంగని పట్టుకుని, ముడ్డి మీద నాలుగు పీకి బుద్ధి చెప్పి, ఊరు నుంచి తోలేశారు. ఆ ఘరానా దొంగ మళ్ళీ వేషం మార్చి, నేను చాలా అమాయకుడిని, ఇక్కడ ఉన్న వారు అందరూ దొంగలు అన్నాడు అంట. అవినీతి గురించి, నువ్వు మాట్లాడితే, అలాగే ఉంటుంది సైకో జగన్ అంటూ టీడీపీ మండిపడింది.
ఇసుక గురించి, మద్యం గురించి, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే, నీకు అంత మంచిది సైకో జగన్ అని టీడీపీ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే నీ ఇసుక దోపిడీకి సంబంధించి FIR కూడా బుక్ అయ్యిందని, విచారణ కూడా జరుగుతుందని తెలిపింది. ఏ నిమిషం అయినా తాడేపల్లి కొంప దాకా వస్తుందని పేర్కొంది. ఇక మద్యం విషయంలో, తాడేపల్లి కొంపలో సాయంత్రం అయ్యేసరికి, నువ్వు డైరెక్ట్ గా ఎంత డబ్బులు వసూలు చేసే వాడివో, ఆ కేసు విచారణ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపింది. నీ డబ్బు పిచ్చతో, ఎంతో మంది ప్రాణాలు తీశావని ఆరోపించింది. ఆ ఉసురు తగలకుండా ఉంటుందా.. కర్మ ఫలం అనుభవించాలి కదా అని వ్యాఖ్యానించింది. అలాగే జగన్ను విమర్శిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పలు ప్రశ్నలు సంధించింది.
1. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? అని అడుగుతున్నావా ? నువ్వు ఉండే బెంగళూరులో లభించటం లేదేమో, మా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుకే లభిస్తుంది. ఒక పక్క ఉచిత ఇసుక లభిస్తుందా అని అడుగుతున్నావ్, మరో పక్క ఇసుక నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయిందని అంటున్నావ్. నీ స్క్రిప్ట్ రైటర్ ని బుర్ర వాడమని చెప్పు.
2. నీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఇసుక రెండింతలు అయ్యిందా ? నీ ప్రభుత్వంలో 20 టన్నుల లారీ రూ.30 నుంచి రూ.40 వేలకి అమ్మితే, మా ప్రభుత్వంలో రూ.16 వేల నుంచి రూ.18 వేలకు కేవలం రవాణా ఇతర చార్జీలతో వస్తుంది. ఇది రెండింతలు అవ్వటమా ? పేపర్లు కొట్టేసిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ?
3. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా స్టాక్ యార్డుల్లో ఉంచావా ? మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే, అప్పుడే 80 లక్షల టన్నులు తీసి పెట్టావా ? నీ మొఖానికి అంత ముందు జాగ్రత్త ఏడిస్తే, ఈ రాష్ట్రం ఇప్పుడు ఇలా ఎందుకు ఉండేది ?
4. నీ ప్రభుత్వంలో అసలు ఇళ్లు కట్టుకోవాలని ఎవరికి ఉండేది ? నీ భారతీ సిమెంట్స్ కోసం సిమెంట్ బస్తాని రూ.450కి అమ్ముకున్న నీచుడువి నువ్వు, మర్చిపోయావా ? అప్పుడు రియల్ ఎస్టేట్ పడుకుంది. మా కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణాలు ఊపందుకున్నాయి. నువ్వు మా రాష్ట్రంలో ఉంటే కదా, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియటానికి.
5. ఇసుక విధానం గురించి, నువ్వే మాట్లాడాలి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి, వందల మంది ఆత్మహత్యకు కారణం అయిన సైకోవి నువ్వు. కేవలం నీ డబ్బు పిచ్చతో, అంత మందిని బలి తీసుకున్నావ్. పాలసీల గురించి, పరిపాలన గురించి నువ్వు మాట్లాడకు. నోటితో కాకుండా, ఇంకా దేంతోనే నవ్వుకోవాలి
6. నీ ప్రభుత్వంలో టన్ను రూ.475కే ఇచ్చావా ? ఎక్కడ ఇచ్చావ్ ? ఎవరికి ఇచ్చావ్ ? నీ దరిద్రపు మొఖంతో, వందల కోట్ల ప్రకటనలు ఇచ్చి, నువ్వు వదిలిన ప్రకటనలు మర్చిపోయావా ? టన్ను 800 నుంచి 1200 వందలు అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది నువ్వు కాదా ? దొంగ లెక్కలు రాసే, దొంగ బ్రతుకు కదా. ఇలాగే దొంగ లెక్కలు చెప్తావ్.