Nara Lokesh | ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ల నుంచి రోజురోజుకీ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ డిమాండ్‌పై పలు విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. బాబు తర్వాత నెంబర్ 2 పొజిషన్లో జనసేనాని అనధికారికంగా కొనసాగుతున్నారు. దీంతో ఇది మింగుడుపడని చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు.. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కల్యాణ్ దూకుడు కళ్లెం వేయొచ్చని భావిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుల నోటి నుంచి ఈ డిమాండ్‌ను చెప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేశ్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం కూడా అవ్వాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని ఆదిరెడ్డి శ్రీనివాసు తెలిపారు. అలాగే పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలే నిర్ణయిస్తారని అన్నారు. వర్మ లేదా మా పార్టీలో ఇంకెవరైనా చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుందని చెప్పారు. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దానికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం, సీఎం పదవులు అంటూ టార్గెట్‌గా చేసుకుని కూటమిలో చిచ్చుపెట్టాలని వైసీపీ సైకోలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని, దీన్ని సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు వక్రీకరించడం సరికాదని హితవుపలికారు. నారా లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓడిపోయి, భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం.. సీఎం అని అంటున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కూడా జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అని పిలుస్తున్నారు.. అలాంటిది తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని నిలదీశారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని.. కార్యకర్తల మనసులోని మాట అని చెప్పారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని.. అది కార్యకర్తలు అందరికీ శిరోధార్యం అని స్పష్టం చేశారు.
Tirumala | తిరుమల కొండపై ఎగ్ పులావ్.. భక్తుల ఆగ్రహం