అమరావతి : ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు (Ramoji Rao) శనివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని, తనకు తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.
సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని అన్నారు. అక్షర యోధుడుగా, తెలుగు వెలుగుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని తెలిపారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. సమస్యలపై పోరాటంలో రామోజీరావు అందరికీ స్ఫూర్తి అని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు, దేశానికి మంచిని మంచిగా, చెడును చెడుగా చాటిచెప్పారని తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.