Chandrababu | ఆ చరిత్ర మళ్లీ రిపీట్ కావాలి.. ఎన్టీఆర్‌పై సెన్సేషనల్ ట్వీట్ చేసిన చంద్రబాబు
Chandrababu | సీనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. తెలుగోడి సత్తా చాటుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికై 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు.
Chandrababu | సీనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. తెలుగోడి సత్తా చాటుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికై 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. 1983లో ఇదే రోజు ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని చంద్రబాబు అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని.. మళ్లీ చరిత్ర పునరావృతం కావాలని ఆకాంక్షించారు.
విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగుజాతి విముక్తి పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్‌ను చంద్రబాబు స్మరించుకున్నారు.
కాగా, చంద్రబాబు చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కొని ఆయన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో అది నాభూతో నా భవిష్యత్తు అని ఒకరు కామెంట్ చేయగా.. ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.. మరి మీరు.. ఆయన మీద చెప్పులు వేయించారని మండిపడ్డారు. వెన్నుపోటు పొడిచిన రోజున కూడా ఇలాగే ట్వీట్(ఎక్స్) చేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 41 ఏండ్ల కాలంలో మూడు సార్లు సీఎంగా పనిచేసినా.. చరిత్ర పునరావృతం కాలేదా అని మరొకరు ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్‌ను చంద్రబాబు చేసిన విమర్శలకు సంబంధించిన ఆర్టికల్స్‌ను కూడా ట్యాగ్ చేశారు.
నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి… pic.twitter.com/rQq2PFsufO
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

