Chandrababu | ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారా? మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బార్కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.