AP News | ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను, ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి అసెంబ్లీ సీటును ఆశించారు. అలాగే రాజశేఖర్ కాకినాడ రూరల్ సీటును ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ రెండు సీట్లు జనసేన పార్టీకి వెళ్లాయి. దీంతో పార్టీ కోసం వారిద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎమ్మెల్సీలుగా టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.