తరిగొండ వెంగమాంబ సాహిత్య సదస్సు ప్రారంభం
కవయిత్రి తరిగొండ వెంగమాంబ వర్ధంతి సందర్భంగా సాహిత్య సదస్సు తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీలోని తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సమావేశాలు...
తిరుపతి: కవయిత్రి తరిగొండ వెంగమాంబ వర్ధంతి సందర్భంగా సాహిత్య సదస్సు తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీలోని తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు, కవయిత్రి అయిన తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి శుక్రవారం నాడు నిర్వహించారు. తొలుత లావణ్య కుమారిటీయం నేతృత్వంలో లక్ష్మీరాజ్యం బృందం సంగీత కచేరీని ప్రదర్శించింది.
తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు వెంగమాంబ సాహిత్యంపై సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. అన్నమాచార్య కళా మందిరంలో ప్రారంభించిన సదస్సుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించి ప్రసంగించారు. వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్మ్యం శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని సరళంగా రంగురంగులుగా వివరిస్తుందని కొనియాడారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా తన భక్తిని ప్రదర్శించారని, వెంగమాంబ తన పద్యాలు, గేయాలు, యక్షగానాల ద్వారా వివిధ రూపాల్లో శ్రీవారి సేవల్లో తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ తరిగొండలో 5 సంపుటాలు, తిరుమలలో 13 సంపుటాలు రచించారని, ఇందులో శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ పాటలు, యక్షగానం, సంకీతాలు, స్తోత్రాలు తదితరాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువా, శ్రీవారి ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు మధుసూధన్ రావు, తరిగొండ వెంగమాంబ బృందం కోఆర్డినేటర్ డాక్టర్ సీ లత ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

