అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడుతో పాటు భార్య, కుమారుడు అనుమానాస్పద స్థితిలో ( Suspicious Deaths ) ఉరివేసుకుని మృతి చెందారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో నివాసముండే విశ్రాంత ఉపాధ్యాయుడు (Retired Teacher ) మధుసూదన్‌రావు (65), అతడి భార్య రత్నావళి ( 60), కుమారుడు సాయిసుకృత్ (25) ఇంటిలో ఉరివేసుకుని చనిపోయారు.
అయితే చేతులకు తాళ్లు కట్టేసి ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఘటనాస్థలంలో సూసైట్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.