అమరావతి : ఎన్నికల వేళల పల్నాడు జిల్లాలో అనుమానాస్పది స్థితిలో ఓ యువకుడు మరణించడం (Suspicious death) స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. షేఖ్ పెద్ద ఖాసి అనే వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కడప నుంచి నరసరావుపేటకు(Narasa Raopet) వచ్చాడు. ఓటు వేసిన అనంతరం తుకపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఫోన్ స్విచ్ఛాప్ అయింది. తెల్లవారుజామున రైల్వే ట్రాక్‌పై వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.