అమరావతి : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ , సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌ను ( IPS Sunil Kumar ) రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ (Suspension) చేసింది. సునీల్‌కుమార్‌పై వచ్చిన అభియోగాలు, ఆరోపణలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా నేతృత్వంలో విచారించిన ప్రభుత్వం సునీల్‌కుమార్‌పై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2020 నుంచి 2024 మధ్య అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా సర్వీస్ నిబంధనలు ( Service Rules ) ఉల్లంఘించి విదేశాలకు వెళ్లినందుకు ఈ చర్యలు తీసుకుంది. వైఎస్ జగన్ ( YS Jagan ) ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేశారు. విచారణ పేరిట అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు చేశారు.