అమరావతి : విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల పీఎస్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. నెల్లిమర్ల ఉపాధి హామీ కార్యాలయంలో కంప్యూటర్ల బ్యాటరీల చోరీ కేసులో విజయనగరం పట్టణం శాంతినగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ సురేశ్ అలియాస్ రాంబాబు(42)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. కాగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఉరేసుకుని చనిపోయాడు.
సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కాగా ఆస్పత్రి మార్చురీలో రాంబాబు మృతదేహాన్ని ఆర్డీవో భవానీ శంకర్ పరిశీలించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారని, మృతి ఘటనపై బంధువులు, పీఎస్‌లో విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.