AP News | ఏపీ శాసన మండలి సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తూ శాసన మండలి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రామాచార్యులు రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టును ప్రసన్నకుమార్‌తో ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది.
ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్ గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా పనిచేశారు. లోక్‌సభ స్పీకర్‌కు ఓఎస్డీగా, ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ ఓఎస్డీగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియమితులయ్యారు.
గత ప్రభుత్వం హయాంలో రామాచార్యుల నియామకం జరిగింది. ఆయన పదవీకాలం పూర్తయినా కొనసాగిస్తూ వచ్చింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రిటైర్ అయినా కొనసాగుతున్న అధికారులంతా రాజీనామా చేయాలని కూటమి సర్కారు ఆదేశిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. దాంతో ఆయన జూలై 9వ తేదీన రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామాను శాసన మండలి చైర్మన్ మోసెన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు.