Tirumala Laddu Isuue | తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశాలు
Tirumala Laddu Isuue | తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి తెలిపారు. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Tirumala Laddu Isuue | తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి తెలిపారు. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్ సూపర్ వైజ్ చేయాలన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని.. ఇందులో రాజకీయ డ్రామా వద్దని సుప్రీంకోర్టు కోరింది.
తిరుపతి లడ్డూ వివాదంపై శుక్రవారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిష్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్)ను కొనసాగించాలా? లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులిచ్చారు. లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కేసు విచారణకు సిట్ విచారణ ఒక్కటే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండటం మంచిదని తెలిపారు..
వైవీ సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. నెయ్యి కల్తీ జరిగింది టీడీపీ సమయంలోనే అని ఆయన కోర్టుకు తెలిపారు. నెయ్యిలో కల్తీ ఉంటే లోపలికి ఎందుకు అనుమతించారని ప్రశ్శించారు. ఈ వ్యవహారంపై సీఎం మాట్లాడరని.. నిన్న మరొకరు మాట్లాడరని చెప్పారు. ఇలాంటి సమయంలో సిట్ దర్యాప్తును సరికాదని పేర్కొన్నారు. దీంతో వాదనలు విన్న ధర్మాసనం.. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

