Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లి దర్శించుకున్నారు. సోమవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈఓ పెద్దిరాజు తోపాటు ఏఈవోమోహన్, మల్లికార్జునరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు అర్చక వేదపండితులచే తిలకధారణ చేసి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి గర్భాలయంలో పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనతోపాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేదపండితులు వేదాశీర్వచనం చేసి జస్టిస్ హిమకోహ్లీకి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, జ్ఞాపికను అందజేశారు.