అమరావతి : ఏపీలో ఇసుక (Sand ) తవ్వకాల కొనసాగింపుపై సుప్రీం కోర్టు (Supreme Court) మండిపడింది . కోర్టు ఆదేశాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపీ అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిర్యాదు స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని, టోల్‌ఫ్రీ నంబర్(Toll Free), ఈ మెయిల్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది.
కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్ ప్రదేశాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసి ఎన్జీటీకి సహకరించాలని స్పష్టం చేసింది. జూన్ 9లోపు ఆదేశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది .