అమరావతి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సుంకేసుల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ కు ఇన్‌ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండగా ఔట్‌ఫ్లో 1.09 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువనకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. సుంకేసుల పూర్తిస్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.81 టీఎంసీలుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పల్నాడు జిల్లా ప్రాజెక్ట్ ల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3.95 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఔట్‌ఫ్లో 3.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 40 టీఎంసీలుగా ఉంది.