అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మృతులు పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్ నుంచి షాలీమార్ ఎక్స్‌ప్రెస్ (Shalimar Express) లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతదేహాలను జీఆర్పీ పోలీసులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి, యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.