అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఆర్కేబీచ్లో ఓ విద్యార్థి గల్లంతైన ఘటన విషాదం నింపింది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా జగదీశ్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకుని అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
విద్యార్థులు ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. వీరంతా విశాఖకు చెందిన వారిగా గుర్తించారు. సముద్రం లోకి వెళ్లవద్దని స్పష్టమైన నిషేధాజ్ఞలు ఉన్నప్పటికినీ సందర్శకులు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు వెల్లడించారు.