అమరావతి : పేదలను మభ్యపెట్టి అవయవాలు ( Organs ) తీసుకునే ఆస్పత్రులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ( AP Minister Satyakumar Yadav) హెచ్చరించారు. గుంటూరు జిల్లా మెడికల్ కళాశాలలో ( Medical College) అవయవదానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమన్నారు . ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు (Brain dead Cases ) వస్తున్నాయని, బాధిత కుటుంబాలకు అవయవదానం చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. అవయవదానం వల్ల మరికొన్ని ప్రాణాలను కాపాడుకోవచ్చని వివరించారు. ప్రజలు కూడా అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.