అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో తలపెట్టిన ఛలో సీఎంవో ఆందోళనను విరమించుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతా రాణా టాటా విజ్ఞప్తి చేశారు. నగరంలో నిరసనలు, ధర్నాలకు అనుమతులు లేవని ఆయ స్పష్టం చేశారు.
ఉల్లంఘనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నేతలు పోలీసులతో సహకరించాలని ఆయన సూచించారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలని వెల్లడించారు.