తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం ( Parveta Utsavam ) సందర్భంగా కనుమ రోజున నిర్వహించే గోదా పరిణయోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్రదీపాలంకార సేవలను రద్దు (Arjitha Seva cancell ) చేసినట్లు వెల్లడించారు.
గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుంచి 6.30 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పించడం జరుగుతుందని వివరించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మలయప్పస్వామి, కృష్ణస్వామి మూర్తులను పార్వేట మండపానికి తీసుకొచ్చి ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.