Srisailam | శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.3.74లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, 4 కిలోల 260 గ్రాముల వెండి కానుకలుగా సమర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే, 977 యూఎస్ డాలర్లు, 25 సింగపూర్ డాలర్లు, పది కెనడా డాలర్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 200 యూకే పౌండ్స్, 30 యూరోలు, 21 కువైట్ దినార్, వెయ్యి వియత్నాం డాంగ్స్, 44 మలేషియా రింగిట్స్, వెయ్యి జపాన్ యెన్స్, పది మాల్దీవుల రుఫియాస్ తదితర విదేశీ కరెన్సీ హుండీ ద్వారా భక్తులు కానకలు సమర్పించారని ఈవో తెలిపారు. హుండీ లెక్కింపు చంద్రావతీ కల్యాణ మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు శివసేవకుల సహాయంతో లెక్కింపు జరిగినట్లు డిప్యూటీ ఈవో రవణమ్మ తెలిపారు.