Srisailam Temple | శ్రీశైలం : ఉగాది మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడోరోజు శనివారం ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగ ప్రభోత్సవం జరిగింది. ప్రభను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
Srisailam Temple
ఆలయ ప్రాంగణం నుంచి శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో మంగళవాయిద్యాలతో గంగాధర మండపం వద్దకు తీసుకొని వచ్చి ప్రభపై అధిష్టించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ప్రభోత్సవం నిర్వహించగా.. వేలాది మంది కన్నడ భక్తులు తిలకించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కీర్తించారు.
Srisailam Temple
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను నందివాహనంపై అధిష్టించారు. అనంతరం షోడషోపచార పూజలు నిర్వహించారు. నందివాహనంపై అధిరోహించినస్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వలన చేపట్టిన పనులు విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Srisailam Temple
శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించారు. చతుర్భుజాలు కలిగిన ఈదేవి వీణ, అక్షమాల, పుస్తకాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్లును ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు జరిగిన గ్రామోత్సవం కనుల పండగగా సాగింది. గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple