మహబూబ్ నగర్ : వీకెండ్ సెలవులు రెండు రోజులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీశైలం( Srisailam ) వెళ్లే యాత్రికులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్( Hyderabad) , శ్రీశైలం( Srisailam) జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా( Traffic) మారింది. కృష్ణమ్మ సవ్వడితో ప్రాజెక్టు గేట్లు ( Project Gates) ఎత్తి నీటిని దిగువకు వెళ్తున్నా ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు తరలివెళుతున్నారు.
ఈ క్రమంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట, ఈగలపెంట, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ భారీగా పెరిగే అవకాశం ఉంది. వందలాది వాహనాల ద్వారా శ్రీశైలం రహదారి రద్దీ గా మారింది. నల్లమల్ల శ్రీశైలం ఘాట్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఏం మాత్రం జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దాదాపు పది కిలో మీటర్ల వరకు వాహనాలు బారులు తీరినట్లు సమాచారం .