Srisailam | శ్రీశైల మహాక్షేత్రం క్యూ కాంప్లెక్సులో పొరుగు సేవల సిబ్బందిగా పని చేస్తున్న పీ నాగేంద్రం మద్యం మత్తులో భక్తులను దుర్భాషలాడి, వారికి ఇబ్బంది కలిగించారని దేవస్థానం అధికారులకు యాదాద్రి- భువనగిరి వీహెచ్‌పీ నాయకులు బింగి భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన దేవస్థానం అధికారులు విచారణలో సంబంధిత ఫిర్యాదు దారు చేసిన ఆరోపణ వాస్తవం అని నిర్ధారించారు. సంఘటనకు కారకుడైన పీ నాగేంద్రం విధులు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకే ముగిసినా డ్యూటీలో లేకున్నా దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/ 1987 ప్రకారం క్షేత్ర పరిధిలో మద్యం సేవించి ఉండటం చట్ట విరుద్ధం.
భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించడంతోపాటు దేవస్థానం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన పీ నాగేంద్రంను పొరుగు సేవల సర్వీసు నుంచి తక్షణం తొలిగించారు. అలాగే దేవస్థానానికి పొరుగు సేవల సిబ్బందిని సమకూర్చిన విజయవాడ- కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ వారిని సంజాయిషీ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు.
ఈ సంఘటన తీవ్రత దృష్ట్యా క్యూ కాంప్లెక్స్ విభాగం సహాయ కార్య నిర్వహణాధికారి, క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షకులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆలయ విభాగం సహాయ కార్య నిర్వహణాధికారి, ముఖ్య భద్రతా అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పర్యవేక్షకులకు మెమో జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవస్థానం అన్ని విధాల తగు చర్యలు తీసుకుంటుందని శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. భక్తుల మనోభావాలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు, క్షేత్ర పవిత్రత కాపాడటానికి అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..!
Stocks | ఆటో.. ఐటీ స్టాక్స్ పతనంతో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. !
UPI Payments | వరుసగా మూడో నెలలోనూ అదే రికార్డు.. జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్..!
Bank of England | 5శాతం వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. 16 ఏండ్ల గరిష్టం నుంచి కోత..!