Srisailam | శ్రీశైలంలో కార్తీక సందడి.. ఆఖరి వారం స్వామి నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రం..!
Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగుతున్నది.
Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగుతున్నది. కార్తీకమాసం ఆఖరి వారం కావడంతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు సోమవారం తెల్లవారు జామునే తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించి, పూజలు చేసుకొన్నారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం, అతి శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దర్శన అనంతరం బయటకు వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయం వెనుక భాగంలో కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు.

ఆంక్షలతో భక్తుల తిప్పలు
కార్తీకమాసం ఆఖరి రోజులు కావడంతో ఒక్కసారిగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. క్షేత్ర వలయ రహదారి వరకే వాహనాలను అనుమతించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా అందరికీ స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. గురువారం నుండి ఆర్జిత సేవా టిక్కెట్లు, గర్బాలయ దర్శనాలు యధావిధిగా అందుబాటులో కొనసాగుతాయని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ వల్ల క్షేత్ర దర్శనానికి వచ్చే వారు ముందుగా ఆన్లైన్ ద్వారా వసతి ఏర్పాట్లు సమకూర్చుకోవాలని ఈవో పెద్దిరాజు సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

