Srisailam | శ్రీశైలం, జూలై 28 : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చిన్న సిద్ధ రామ శివాచార్య మహాస్వామి వారు దర్శించుకున్నారు. సోమవారం ఆలయ రాజ గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో శ్రీనివాస రావు, అర్చక వేద పండితులు బిల్వ మాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాల అనంతరం అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులచే వేద వేద స్వస్తి పలకగా ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాలు శేష వస్త్రాన్ని అందించారు.
Srisailam3
శ్రీశైల మల్లన్న దర్శించుకున్న అనిల్ చంద్ర పునీత
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునీత దర్శించుకున్నారు. సోమవారం ఆలయ రాజ గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో శ్రీనివాస రావు పూలమాలతో స్వాగతం పలకగా అర్చక వేద పండితులు తిలకధారణ చేశారు. అనంతరం మోహన్ భగవత్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాల అనంతరం అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాలు శేష వస్త్రాన్ని అందించారు.