Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. కనుక వచ్చే భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగడంతోపాటు వారు సూచించిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయాలని సీఐ ప్రసాదరావు సూచించారు. గురువారం క్షేత్రపరిధిలోని జీపు, ఆటో డ్రైవర్లు యజమానులతో రోడ్డు భద్రతా అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సులో శ్రీశైలం ఈఓ శీనివాసరావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.
రోడ్డుపై ఆటో, జీపు నడుపుతున్నప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను శ్రీశైలం ఈఓ శీనివాసరావు వివరించారు. రవాణాశాఖ నిబంధనలను పాటిస్తూ యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా స్నేహభావంతో సేవలందించాలని తెలిపారు. అదే విధంగా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్ క్లియరెన్స్ చేసుకోవాలని సీఐ ప్రసాదరావు చెప్పారు. ఈ అవగాహన సదస్సులో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.