శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అనుచరుడి మోసం బట్టబయలైంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ స్థాపించి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు కాజేసినట్లు వైసీపీ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అలాగే తమ సెంటర్లో శిక్షణకు వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది.
వైసీపీ తన ట్విట్టర్లో తెలిపిన దాని ప్రకారం.. బసవ రమణ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను స్థాపించాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లు చేశాడు. అలాగే శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నలుగురు కుర్రాళ్లు.. అమ్మాయిల ఇంట్లో చెప్పాడు. దీంతో వారిని బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతం కావడంతో బసవ రమణ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి.
Dear @naralokesh garu, need your immediate intervention,
Basava Ramana, founder and president of Srikakulam District IAC (Indian Army Calling), is playing with the lives of thousands of students. They collect 5-10 lakhs from the students saying that they will provide jobs in… pic.twitter.com/FM53WYyVW4
— Kumar మద్దూరి (PawanKalyan and Modi Ka Parivar) (@Janasena_Telugu) December 5, 2024
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పుకుని బసవ రమణ అనేక దందాలు, అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. కేంద్రమంత్రి పేరు వాడుకుని షాపింగ్ మాల్స్ బార్లకు వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు తెగబడ్డాడు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి దుర్మార్గాలకు పాల్పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వ నాయకులు పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా, బవస రమణ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కు సన్నిహితుడు అని కూడా తెలుస్తోంది. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా అని చంద్రబాబు నాయుడిపై వైసీపీ మండిపడింది