అమరావతి: రేపటి నుంచి దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించ నున్నారు. కరోనా నిబంధనల నడుమ నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.