అమరావతి : ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 08579/08580 నెంబర్‌గల ప్రత్యేక రైలు అక్టోబరు 5 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని వెల్లడించారు.
ఇదే రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7.40కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ , గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు. 08585/08586 అనే నంబర్ గల రైలు అక్టోబర్ 4 నుంచి 26 వ తేదీ వరకు విశాఖపట్నం, మహబూబ్‌నగర్ మధ్య నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రైలు విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలు దేరి మరుసటిరోజు ఉదయం 10.30కి మహబూబ్‌నగర్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయలు దేరి మరుసటిరోజు ఉదయం 9.50 కు విశాఖకు చేరుకుంటుందని వెల్లడించారు. భువనేశ్వర్‌నుంచి తిరుపతికి వెళ్లే వారాంతపు 02809/02810 నంబర్ గల ప్రత్యేక రైలును అక్టోబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీవరకు నడపనున్నారు. ఈ రైలు ఖుర్ధారోడు, బరంపురం, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు , నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వివరించారు.