Srisailam | శ్రీశైలంలో కార్తీక సోమవార పూజలు.. ఆది దంపతులకు దశవిధ హారతులు
Srisailam | కార్తీక మాసోత్సవంలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో పరమ శివునికి పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు ఈఓ పెద్దిరాజు, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చెప్పారు. కార్తీకమాసంలో తొలి సోమవారం స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Srisailam | కార్తీక మాసోత్సవంలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో పరమ శివునికి పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు ఈఓ పెద్దిరాజు, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చెప్పారు. కార్తీకమాసంలో తొలి సోమవారం స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేళ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయోత్సవంగా తోడుకునివచ్చి పుష్కరిణి వద్ద ప్రత్యేక పుప్పాలంకరణతో అలంకరించిన వేదికపై వేంచేబు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణికి దశవిధ హారతులను జరిపించారు.

ఈ కార్యక్రమానికి ప్రతియేటా వేల సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, మార్కండేయ శర్మ, పీఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్‌కుమార్, ఏఈవోలు మోహన్, హరిదాస్, ఫణిధర్ ప్రసాద్, ఈఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హారతుల దర్శన ఫలం ఇలా
1. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హరతిని దర్శించడం వలనకష్టాలన్నీ నివారించబడి సకలు శుభాలు కలుగుతాయి.
2. నాగ హారతి : నాగ హారతిని దర్శించడంతో సర్పదోషాలు తొలిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

3. త్రిశూల హారతి : త్రిశూల హారతిని దర్శించడంతో అకాల మరణాలు తొలిగి గ్రహ దోషాలు నివారించబడుతాయి.
4. నంది హారతి : నంది హారతిని దర్శించడంతో భయం దుఖం తొలిగిపోయి ఆనందం నూతనోత్సాహం లభిస్తాయి.

5. సింహ హారతి : సింహ హారతిని దర్శించడంతో శత్రు భాదలు తొలిగి మనో ధైర్యం పెరుగుతుంది.
6. సూర్య హారతి : సూర్య హారతిని దర్శించడంతో ఆరోగ్యం చేకూరి దీర్ఘాయుశ్సు లభిస్తుంది.

7. చంద్ర హారతి : చంద్ర హరతిని దర్శించడంతో మనశ్సుద్ది కలిగి ఈర్ష్య అసూయ ద్వేషాలు తొలిగిపోతాయి.
8. కుంభ హారతి : కుంభ హారతిని దర్శించడంతో కోరుకున్న కోర్కెలు నెరవేరి సంపదలు కలుగుతాయి.

9. నక్షత్ర హారతి : నక్షత్ర హారతిని దర్శించడంతో జాతక దోషాలు తొలిగి చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. కర్పూర హారతి : కర్పూర హారతిని దర్శించడంతో పాపాలన్నీ తొలిగి యఙ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

