తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 1న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం, 5న వసంత పంచమి, 8న రథసప్తమి, 12న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి, 16న పౌర్ణమి గరుడసేవ, శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి వంటి విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొన్నది.