తిరుమల : తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల (Special festivals ) వివరాలను టీటీడీ(TTD) ప్రకటించింది. ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి, ఆగస్టు 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. 7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ముగింపు, 8న ఆళ్వందార్ల వర్ష తిరు నక్షత్రం, 9న శ్రావణ పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 10న తిరుమల శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు, ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం, 17న తిరుమల శ్రీవారి సన్నిధిన శిక్యోత్సవం, ఆగస్టు 25న బలరామ జయింతి, వరాహ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.