Brahmotsavam | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వారికి ప్రత్యేక దర్శనాలు రద్దు
Tirumala | తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల : తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు.
ఈ కారణంగా సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. దాదాపు పది రోజుల పాటు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ రోజుల్లో బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
టీటీడీ ఆదాయం రూ. 4.37 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 63,202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 34,057 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.37 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

