అమరావతి: “చలో విజయవాడ”కు వచ్చే ఉద్యోగ నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు గృహనిర్భందం చేశారు. మరికొన్ని చోట్ల ముందస్తుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.