సంప్రదాయ భోజనం నిలిపివేత

- సోషల్మీడియాలోఅసత్యప్రచారాన్ని నమ్మొద్దు
- భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలకమండలి లేని సమయంలో అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టారని తెలిపారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదని స్పష్టంచేశారు. ట్రయల్న్ విజయవంతం కాకపోవడంతో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. సంప్రదాయ భోజనంపై సోషల్‌మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. వాటిని భక్తులు నమ్మొద్దని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉచిత సర్వదర్శనాలపై అధికారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
వైభవంగా గోకులాష్టమి
తిరుమలలో గోకులాష్టమి వేడుకలను సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద కాళీయమర్థనునికి పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

