ఏఓబీలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది : ఏపీ డీజీపీ
ఏపీ డీజీపీ | ఏఓబీలో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

అమరావతి : ఏఓబీలో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గత నెలలో లొంగిపోయిన స్పెషల్ జోనల్ కమాండర్ ఇక్కడి పరిస్థితిని పోలీసులకు చెప్పారని ఆయన వివరించారు. ఇవాళ ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు, మరో ముగ్గురు కీలక నేతలు లొంగిపోయినట్లు వెల్లడించారు. ‘ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుండటంతో బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్లు నివేదకలు చెబుతున్నాయి. రక్తపాతం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్ధమైంది.
విద్య, వైద్యం సమస్యలు ఆదివాసీలకు ఇప్పుడు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు పిలుపునిచ్చినా గిరిజనులు ఆసక్తి చూపట్లేదు. గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు. అనేకమంది మావోయిస్టులు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా చేరుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తుంది.
నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి. పోలీసుల భాష, ప్రవర్తన మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మావోయిస్టులకి ఆదివాసీల మద్దతు లేదు. రిక్రూట్మెంట్కు ఏపీ యువత ముందుకు రాకపోవడంతో ఛత్తీస్ ఘడ్ నుంచి నియమించుకుంటున్నారు. స్థానిక సమస్యలపై, తెలుగు భాషపై వాళ్లకు అవగాహన లేకపోవడంతో కేవలం తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లలో చాలామంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని డీజీపీ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

