అమరావతి : తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం(Laddu adulatration) పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు(DGP Dwaraka Tirumal Rao) వెల్లడించారు. సుప్రీంకోర్టు(Suprem Court)లో ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న రాష్ట్ర లాయర్ల సూచన మేరకు విచారణను నిలిపివేశామని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి సిట్ దర్యాప్తు(SIT investigation) కొనసాగుతుందని వివరించారు. తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేదీవరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు(DGP Dwaraka Tirumala Rao) వెల్లడించారు. మంగళవారం తిరుమల (Tirumala) లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అందుబాగులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల (Brahmotsavam ) సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు.
తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.. ప్రయాణిలకు భద్రత ప్రథమ ప్రాధాన్యం కింద తీసుకుని ఆర్టీసీలో ప్రయాణం భద్రత ఉంటుందని అవగాహన కల్పిస్తున్నామన్నారు