అమరావతి : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) లో కూటమి అభ్యర్థులు(Alliance candidates) మరో విజయం సాధించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు గెలుపొందారు. విశాఖలో భారీ మెజారీటి ఉన్నప్పటికీ వైసీపీ (YCP) విజయం సాధించలేకపోయింది. 97 మంది కార్పొరేటర్లు (Corporators) ఉన్న జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం వైసీపీకి తీరని షాక్ తగిలింది.
జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన 12 మంది టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. తాజాగా విశాఖకు చెందిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆగస్టు 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడ జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులే సుమారు 600 మంది వరకు ఉన్నారు. వీరి ఓటుతో సులభంగా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటామని వైసీపీ నాయకులు ధీమాలో ఉన్నప్పటికీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి చెందడం ఆ పార్టీలోకలవరం మొదలైంది.
విశాఖపట్నం మహానగరంలో మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అసెంబ్లీ స్థానాలుండగా వీటిలో టీడీపీ, జనసేన , బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. గతంలో వైసీపీకి గట్టి పట్టున్న స్థానాలను సైతం కూటమి సభ్యులు గెలుపొందారు.